సిరాన్యూస్,ఓదెల
కలెక్టర్ ను కలిసిన గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఇటీవల నియామకమైన అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ గా నియామకమైన మినుపాల ప్రకాశరావు లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్షను సోమవారం తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావుకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.