సిరాన్యూస్, ఆదిలాబాద్
గ్రంథాలయాల అభివృద్ధి కృషి : రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ డాక్టర్ రియాజ్
* కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ సందర్శన
గ్రంథాలయాల అభివృద్ధి కృషి చేస్తున్నామని రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ పర్యటించారు. ఈసందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్బంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.క్యాంపు ఆఫీస్ చాలా బాగుందన్నారు.నియోజక వర్గంలో కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవాకార్యక్రమాలు తెలుసుకుని మెచ్చుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లైబ్రరీలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాలు అభివృద్ధి చెంది పాఠకులకు మరిన్ని మెరుగైన సేవలందిస్తాయన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,లోక ప్రవీణ్ రెడ్డి,ఎం.ఏ షకీల్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,బండారి సతీష్,ఆవుల వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,నాయకులు సింగిరెడ్డి రామ్ రెడ్డి,పోరెడ్డి కిషన్,బూర్ల శంకరయ్య,ఎం.ఏ ఖయ్యుమ్,సాత్విక్ రెడ్డి,అశోక్,సంద రమాకాంత్,శ్రీనివాస్,షౌకత్ అలీ,షేక్ ఖలీం,వసంత్ పవర్ తదితరులు పాల్గొన్నారు.