సిరాన్యూస్, భీమాదేవరపల్లి
గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తికి ఘన సన్మానం
హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క చొరవతో రెండు రోజుల క్రితం కేడం లింగమూర్తిని సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమించింది. ఈసందర్భంగా శుక్రవారం లింగమూర్తిని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ఘనంగా సన్మానించారు. అనంతరం సీనియర్ అంబేద్కర్ వాదులు మాట్లాడుతూ కేడం లింగమూర్తి అంబేద్కర్ సంఘాలను బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు. ఈసందర్బంగా కెడం లింగమూర్తికి చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ అంబేత్కర్ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు తోందూరి ఎల్లన్న, కండే సుధాకర్, మాడుగుల సంపత్, సిద్ధమల్ల వెంకటేష్,పొన్నాల ఫ్రాన్సిస్, వేముల జగదీష్, ఎర్ర కార్తీక్, కొడముంజ మల్లేష్, గంగారపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.