సిరాన్యూస్, ఓదెల
గణనాథుడికి పూజలు చేసిన జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్
పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో బుదవారం పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు జూలపల్లి ఎస్ఐ శ్రీధర్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురా రోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడిపంటతో, సుభిక్షంగా ఉండాలని కోరారు. అనంతరం రఘువీర్ సింగ్ ని ఇతర నాయకులను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు నాయకులు కొంజర్ల వెంకటయ్య, లోక రవీందర్ రెడ్డి, గడ్డం నర్సింహారెడ్డి, భగవాన్ సింగ్, సింగిరెడ్డి జలపతి రెడ్డి, బెజ్జంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.