LIC: ఎంసీఆర్‌బీ బ్యాంకు ఆధ్వర్యంలో ఎల్ఐసీ జీవిత భీమా

సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఎంసీఆర్‌బీ బ్యాంకు ఆధ్వర్యంలో ఎల్ఐసీ జీవిత భీమా
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ కోపరేటివ్ రూరల్ బ్యాంకు ఆధ్వర్యంలోఎల్ఐసీ జీవిత భీమా పాలసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో బ్యాంకులో సభ్యులుగా ఉండి, 55 సంవత్సరాల లోపు ఉన్న సభ్యులకు అర్హతను, వాట ధన విలువలను బట్టి హుస్నాబాద్ బ్రాంచ్ ఎల్ఐసీ ఆఫీసర్లు జీవిత భీమను కేటాయించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసర్లు, ఎంసీఆర్‌బీ బ్యాంకు మెంబెర్ గుగులోతు బాషు, ఎంసీఆర్‌బీ బ్యాంకు ఆఫీసర్లు సుదర్శన్, మల్లారం గోదాం కిపర్ తాండ్ర రాజకొమురయ్య, గూడలి రవీందర్ రెడ్డి , బ్యాంకు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *