సిరాన్యూస్, ఖానాపూర్
స్లాటర్ హౌస్‌ను పరిశీలించిన ఎస్సై జి లింబాద్రి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో స్లాటర్ హౌస్ (కాటిక దుకాణం) ను బుధవారం ఖానాపూర్ ఎస్సై జి లింబద్రి , ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈసందర్భంగా వారికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. ముస్లిం ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండగను జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినట్లయితే చట్టం ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు.