సిరాన్యూస్, నేరడిగొండ
గోవధ నిషేధ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి
* విశ్వ హిందూ పరిషత్ మండల సహా సంయోజక్ లింగాల సంతోష్ గౌడ్
* నేరడిగొండలో కరపత్రాల విడుదల
గోవధ నిషేధ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ మండల సహా సంయోజక్ లింగాల సంతోష్ గౌడ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహిని కార్యకర్తలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదని, వాటిని తక్షణమే అమలు చేయాలని అన్నారు. అక్రమ గో రవాణాను అడ్డుకునేందుకు శాశ్వత చెక్ పొస్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోసంరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. దీనికోసం ప్రతీ గ్రామంలో జన జాగరణ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని మండల అధ్యక్షులు సోలంకి సాయి కిరణ్, హిందూ సంస్థల నాయకులు సాబ్లే సంతోష్ సింగ్, మహేందర్, సురేందర్, రవి నాయక్, శేఖర్, ధన్ను,లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు