సిరా న్యూస్, భీమాదేవరపల్లి
గాంధీనగర్‌లో ఈనెల 23న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ: కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడియం లింగమూర్తి
* అంబేద్కర్ విగ్రహ వాల్ పోస్టర్ విడుదల
మదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ (మాణిక్యాపూర్)గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈనెల 23 న ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడియం లింగమూర్తి తెలిపారు. గురువారం మదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ (మాణిక్యాపూర్)గ్రామంలో ఆయన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ దళిత సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలు ,గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి ఐలయ్య ,ప్రధాన కార్యదర్శి విద్య సాగర్,గౌరవ సలహాదారులు తాళ్ల పెళ్లి జగన్, తాళ్ల పెళ్లి రవీందర్, తాళ్ల పెళ్లి రాజయ్య, ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమార్ ,తాళ్లపల్లి కిరణ్ , సమ్మక్క సారక్క మాజీ చైర్మన్ మాడుగుల అశోక్, తాళ్లపల్లి కుమార్, బీసీ నాయకులు వేముల జగదీష్, దళిత సంఘాల సీనియర్ నాయకులు రేణిగుంట్ల బిక్షపతి, తాళ్ల పెళ్లి అరవింద్, కొమురయ్య, తాళ్లపల్లి చిన్న రాజయ్య తదితరులు పాల్లొన్నారు.