సిరా న్యూస్, ఓదెల
లింగేశ్వర స్వామి ఆలయంలో నాగు పాము ప్రత్యక్షం
* విగ్రహంపై పడగవిప్పి కూర్చున్న పాము
* పూజలు నిర్వహించిన భక్తులు
ఓ ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయం బయట ఉన్న దేవత విగ్రహంపై నాగు పాము ప్రత్యక్షమైంది. ఈఘటన
ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది. ఓదెల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పక్కన ఉన్న శ్రీ పార్వతి శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో దగ్గర రెండు సంవత్సరాల క్రితం నాగులమ్మ జంట నాగులు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సోమవారం ఉదయం విగ్రహంపై నాగుపాము పడగ విప్పి ప్రత్యక్షమవడంతో స్థానిక ప్రజలు చూసి మహిమగల జంటనాగుల విగ్రహనికి శివనామ స్మరణతో ప్రత్యేక పూజలు చేశారు.