సిరా న్యూస్, పెంబి:
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి జెడ్పి ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ మేరకు విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తమ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు సల్ల స్వప్నిల్ రెడ్డి, పుప్పాల శంకర్, టి శంకర్, మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు