లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య ప్రకృతి వైద్య& ఆక్యుపంక్చర్ హెల్త్ కేర్ సెంటర్ క్యాలెండర్ ఆవిష్కరణ

 సిరా న్యూస్,కమాన్ పూర్;
లయన్స్ క్లబ్ సెంటినరీ కాలని అధ్వర్యంలో డైరెక్టర్ డాక్టర్ శరణ్య గారి ప్రకృతి వైద్య ఆక్యుపంక్చర్ హెల్త్ కేర్ సెంటర్ క్యాలెండర్ అవిష్కరణ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా విచ్చేసిన మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైద్యం అనేది జీవన విధానం అని, ప్రాచీన కాలంలో మనిషి జీవితం ప్రకృతి తో మమేకమై ఉండేది కానీ ప్రస్తుతం కాలంలో ప్రకృతి విధ్వంసం అవడం వల్ల మానవ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది.

ప్రకృతి వైద్యం (నేచురోపతి) అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే, స్వస్ధతను కలిగించే ఒక శక్తి యొక్క ఉనికిని గుర్తించి చేసే చికిత్సా విధానం. ప్రకృతి వైద్యం మరియు అక్యుపంచర్ చికిత్స ద్వారా అతి తక్కువ ఖర్చుతో మందులు, ఆపరేషన్ అవసరం లేకుండా నడుము,వెన్నుముక, మెడ మరియు సయాటికా వంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మరియు ఇలాంటి గొప్ప వైద్యాన్ని సింగరేణి ప్రాంతంలో అందిస్తున్నందుకు డాక్టర్ శరణ్య ను అభినందిస్తూ రాబోయే రోజుల్లో ప్రకృతి వైద్యాన్ని మరింత విస్తరించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీసుకురావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోల్మురీ శ్రీనివాస్ , మాజీ సర్పంచ్ గంట పద్మ, సింగరేణి లైజర్ ఆఫీసర్ గడ్డం గడ్డం శ్రావణ్ కుమార్,లైన్స్ క్లబ్ డైరెక్టర్స్ ,సివిల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ బెల్లం శ్రీనివాస్, మేకల మారుతి, కళాధర్ రెడ్డి,తీగల శ్రీధర్, దోంతుల సురేష్, కల్వచర్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కోలిపాక సారయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *