సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న డెక్కన్ ఎలైట్ హోటల్ బిర్యానీ లో బల్లి కలకలం రేపింది. మద్యాహ్నం బిర్యాని తినడానికి హోటల్ కు కొంతమంది యువకులు వచ్చారు. బిర్యానీ ఆరగించిన తరువాత చివరిలో బల్లి ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా షాక్ కు గురైన యువకులు, హోటల్ యాజమాన్యం పై మండి పడ్డారు. బిర్యానీ తిన్న కొద్దిసేపటి కే వాంతులు చేసుకున్నారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించారు. బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.