సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్ లో బైక్ దొంగతనం చేసి, తీసుకెళ్తుండగా,బైకు యజమాని స్థానికుల సహకారంతో దొంగను పట్టుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేసి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చింతపాలెం కి చెందిన గోనె నాగరాజుగా గుర్తించారు. నిందితుడు నాగరాజుపై గతంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.