సిరా న్యూస్, బేల:
సేవాలాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన లోక ప్రవీణ్ రెడ్డి
+ యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని హితువు
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలనీ, క్రీడలతోనే మానసికోల్లాసం సాధ్యమని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలైతాండ గ్రామంలో సంత్ సేవాలాల్ మెగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం టాస్ వేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సదర్భంగా గ్రామస్తులు, స్థానిక యువకులు లోక ప్రవీణ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో వెనుకబడుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, ప్రోత్సహించే దిశగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ. 21 వేలు అందించడం జరుగుతుందని అన్నారు. రెండో స్థానం కైవసం చేసుకున్న జట్టుకు చౌహాన్ రాంలాల్ రూ. 11 వేలు, మూడో స్థానం కైవసం చేసుకున్న జట్టుకు కుమ్ర గంభీర్ (టీచర్) రూ. 7500 అందిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాథోడ్ శ్యాం రావ్, చవాన్ దశరథ్, రాథోడ్ దినేష్, రాథోడ్ గోపాల్, చవాన్ రాహుల్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.