సిరా న్యూస్, జైనథ్:
రామాలయం కోసం రూ. 1 లక్ష విరాళం అందించిన లోక ప్రవీణ్ రెడ్డి
బిజెపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠ గ్రామంలోని రామాలయం నిర్మాణం కోసం రూ. 1 లక్ష విరాళం అందించి తన ఉదారత చాటుకున్నారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆలయంలో యజ్ఞ, హోమాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు, స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు లోక ప్రవీణ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. స్వామి వారి ప్రతిమను బహుకరించి తమ కృతజ్ఞతను తెలిపారు. ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం ఏర్పాటు కోసం రూ. 1 లక్ష విరాళం అందించడం సంతోషకరమని అన్నారు. అనంతరం లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని అన్నారు. ఆధ్యాత్మికతతోనే మనిషి జీవితానికి సార్థకత లభిస్తుందని ఆయన అన్నారు.