సిరా న్యూస్, ఆదిలాబాద్:
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లోక ప్రవీణ్ రెడ్డి..!
ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలుపొందడంతో, ప్రస్తుతం ఆదిలాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యింది. దీంతో పార్టీలో పనిచేస్తున్న పలువురు సీనియర్ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు అదిష్ఠానం వద్ద పరిశీలనకు చేరినట్లు సమాచారం. అయితే ప్రస్తుత బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న లోక ప్రవీణ్ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. ఏళ్లుగా పార్టిని అంటిపెట్టుకొని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న లోక ప్రవీణ్ రెడ్డి పేరు సైతం పరిశీలన ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలుపు కోసం విశేష కృషీ చేసిన ఆయనకు అధ్యక్ష పదవి బాధ్యతలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అయితే లోక ప్రవీణ్ రెడ్డి మాత్రం ఈ సారి అధ్యక్ష బాధ్యతలు తనకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.