సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది.ఘటనలో సంజీవరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ కుడా కల్వర్టు రైలింగ్ పై కి దూసుకుపోయింది. అధికలోడు, అధికవేగమే ఘటనకీ కారణమని స్థానికులు అంటున్నారు. అతి వేగంగా వస్తున్న వాహనాలపై పలుమార్లు పిర్యాదు చేసినా సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపించారు.