సిరాన్యూస్, ఓదెల
ఇద్దరికి కంటి వెలుగు ప్రసాదించిన శ్రీనివాస్
* ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి
ఓదెల మండల కేంద్రానికి చెందిన బైరి శ్రీనివాస్ ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి కోల్పోయిన దుఃఖంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి ఆయన నేత్రాలను దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి , దాత బావ అయిన మేరుగు సారంగపాణి బావమరిది శ్రీనివాస్ ప్రమాదంలో మరణించగానే,హఠాన్మరణం చెందిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, ఎల్‌వీపీ టెక్నీషియన్ గాజులు సతీష్ సహకారంతో నేత్రదానం చేయించారు. భార్య రజిత, కుమారులు వినోద్, సాయి, కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, జాతీయ కార్యదర్శి లింగమూర్తి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ప్రతినిధులు సానా రామకృష్ణా రెడ్డి, నూక రమేశ్, చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి రాజమెగిలి, భీమనపల్లి పృథ్వీరాజ్ ,క్యాతం మల్లేశం, శారద లయన్ శశికళ, తానిపర్తి విజయలక్ష్మి, బెనిగోపాల్ త్రివేది తదితరులు అభినందించారు.