Maccha nursing:పైడిపల్లి శృతి కుమార్  కుటుంబానికి  రూ. 10వేల ఆర్థిక సాయం అంద‌జేసిన మచ్చ నర్సింగం

సిరాన్యూస్‌, ఓదెల‌
పైడిపల్లి శృతి కుమార్  కుటుంబానికి  రూ. 10వేల ఆర్థిక సాయం అంద‌జేసిన మచ్చ నర్సింగం
అభినందనలు తెలిపిన ఎస్సై జి. అశోక్ రెడ్డి

ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో వినాయక మండపంలో నిరుపేద కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం మచ్చ నర్సింగం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై జి అశోక్ రెడ్డి హాజరై ఎస్సై చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మచ్చ నర్సింగం మాట్లాడుతూ తన సొంత గ్రామానికి చెందిన నిరుపేదలైన పైడిపల్లి శృతి కుమార్ కుటుంబానికి పది వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా వినాయక నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాదం అందిస్తూ స్వామి వారి పేరు మీద అనేక సేవా కార్యక్రమం జరిపే వారమని ఈ సంవత్సరం నిరుపేద కుటుంబమైన పైడిపల్లి శృతి కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంలో చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి మాట్లాడుతూ,, పేద కుటుంబానికి ఎంతో పెద్ద మనసు చేసుకొని పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఒక గొప్ప విశేషమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ రెడ్డి, మచ్చ నర్సింగం, మాజీ ఎంపీటీసీ చొప్పరి సారమ్మ రాజయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు ఎం డి రఫీ, మేక శ్రీనివాస్, ఉడిగె సదయ్య, తోట కొమురయ్య, బాషు మియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *