పలువురికి గాయాలు
సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా, గుత్తి పట్టణంలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న వారిపై దాడి చేసి తన ప్రతాపం చూపించింది. టమోటా మార్కెట్ వీధిలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. ఆరుబయట నిద్రిస్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది. స్వైరవిహారం చేస్తున్న పిచ్చికుక్కను తరిమెందుకు వెల్లిన వారిపై కూడా దాడి చేసింది. పిచ్చి కుక్క దాడిలో సుమారుగా 8 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వెంకటరాముడు, నారమ్మ , పవన్ ,సాధిక్ , ఇర్ఫాన్ , బాషా తో పాటు మరి కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాలనీకి చెందిన యువకులందరూ కర్రలతో పిచ్చికుక్కను వెంటాడి చంపేశారు. పిచ్చికుక్క కాలనీలో మనుషులతో పాటు కుక్కలు, కోళ్లపై కూడా దాడి చేసిందని కాలనీవాసులు తెలిపారు.