ట్రెండింగ్ లో మాధురి వంటలు

సిరా న్యూస్,శ్రీకాకుళం;
ఆమె వయసు 33.. ఆయన వయసు ఫిఫ్టీ ప్లస్.. అయినా ప్రేమకు వయసేంటని ఇద్దరు నిరూపించారు. కుటుంబ వ్యవహారం రోడ్డున పడినా సరే.. తమ ప్రేమకు లేరు ఎవ్వరు అడ్డు అన్నట్టు వ్యవహారం సాగుతోంది. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ప్రేయసి దివ్వెల మాధురి ప్రేమ వ్యవహారం గురించే.వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్వెల మాధురితో సహజీవినం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారం ఇప్పు గత కొద్దిరోజులుగా ఏపీ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. అయినా కూడా మాధురి ఎక్కడ తగ్గడం లేదు. ఇన్నాళ్లు ప్రైవేటుగా నడిపించిన వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ లోకి తీసుకొస్తోంది మాధురి. దువ్వాడ శ్రీనుతో ప్రేమ వ్యవహారాన్ని బహిరంగానే ప్రస్తావిస్తోంది.తాజాగా తన సొంత యూట్యూబ్ చానల్‌లో దువ్వాడ శ్రీను కోసం ఇష్టమైన పప్పుచారు అని ఓ వీడియోను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది ఈ వీడియో. మొన్నటి కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. అయినా కూడా మాధురి ఎక్కడ తగ్గడం లేదు. ఇన్నాళ్లు ప్రైవేటుగా నడిపించిన వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ లోకి తీసుకొస్తోంది మాధురి. దువ్వాడ శ్రీనుతో ప్రేమ వ్యవహారాన్ని బహిరంగానే ప్రస్తావిస్తోంది. తాజాగా తన సొంత యూట్యూబ్ చానల్ లో దువ్వాడ శ్రీను కోసం ఇష్టమైన పప్పుచారు అని ఓ వీడియోను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది ఈ వీడియో.ఇటీవల ఆమె సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ మొన్న. ఇష్టంగా అనుకున్నాను. కానీ, వ్యసనంగా మారిపోయావు.. అంటూ రీల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశించే ఆమె ఇలాంటి పోస్టులు చేశారన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి సోషల్ మీడియాలో దివ్వెల మాధురి పెట్టిన పోస్టులు హీటెక్కిస్తున్నాయి.
తిరుమలలో దువ్వాడ, మాధురి
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం ఒక రేంజ్ లో రచ్చ చేసింది. ఒక సీరియల్ ఎపిసోడ్ లా మారింది. తెలుగు మీడియాకు అదే ప్రధాన వనరుగా మారిపోయింది. విజయవాడ వరదలు సంభవించిన వరకు అదే ప్రధాన వార్తగా నిలిచింది. తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి.. దువ్వాడ నూతన గృహంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.అక్కడ నుంచి రచ్చ ప్రారంభమైంది. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడతో తనకు ఉన్న సంబంధాలపై రకరకాలుగా మాట్లాడారు. ఎన్నికల ముందు నుంచి దువ్వాడతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తొలుత దువ్వాడ వాణి వైఖరితోతాను ఇబ్బంది పడ్డానని.. నడి వీధిలోకి వచ్చానని చెప్పుకొచ్చారు మాధురి.తరువాత దువ్వాడ శ్రీనివాస్ కు అప్పు ఇచ్చానని.. అప్పులో భాగంగా ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం మరింత పెరిగింది. చివరకు దువ్వాడ శ్రీనివాస్ ఆ రెండు కోట్ల అప్పుకు బదులు ఇంటిని మాధురి పేరుతో రాశారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అదే ఇంట్లో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి ఉంటున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు తిరుమలలో ప్రత్యక్షం కావడం విశేషం.ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు.సరిగ్గా ఇటువంటి క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్,మాధురి తిరుమలలో కనిపించారు.అటు మీడియా సైతం వారికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది.దువ్వాడ శ్రీనివాస్ వెంట అనుచరులు,కొంతమంది వైసీపీ నేతలు సైతం ఉన్నారు.అయితే దాదాపు భార్య మాదిరిగానే ఆమె తిరుమలలో శ్రీనివాస్ వెంట ఉండడం కనిపించింది.ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్ హీరోగా వాలంటీర్ అనే సినిమాను రూపొందించారు మాధురి.దానిని యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. మధ్యలో స్కూటీపై ఆ జంట కనువిందు చేస్తూరూపొందించిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతంవారిద్దరూ కొత్త ఇంట్లో ఏకాంతంగా గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దానిని నిజం చేసేలాఆ ఇద్దరు సన్నిహితులు రీల్స్ చేస్తూ కనిపించడం విశేషం. ఇప్పుడు ఏకంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో సైతం ప్రత్యేక పూజలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దువ్వాడ వాణి విడాకులు ఇస్తే తాము పెళ్లి చేసుకుంటామని ఇది వరకే మాధురి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరి బంధం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *