సిరాన్యూస్, చిగురుమామిడి
ముదిమాణిక్యంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం వేడుకలు చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి కుతుబుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ సీపీఐ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. భగవంతుని ఆశీస్సులతో కలకాలం నిండునూరేళ్లు, ఆయురారోగ్యాలతోఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు.అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉపాధి కూలీలకు స్వీట్లు పంపిణీ చేశారు. వెలిశాల రాజేందర్రావును ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పశ్చిమట్ల లక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చీల లక్ష్మారెడ్డి, తాజా మాజీ ఉపసర్పంచ్ ముంజ శిరీష, ప్రకాష్ గౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జేరిపోతుల రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంగోని శ్రీనివాస్, మల్లికార్జున్, ఓదెలు రసూల్ ముంజ వెంకన్న, గణేష్, బాబు, రమేష్, మునీందర్, అజయ్, సీపీఐ నాయకులు కాదాసు మోహన్, లక్కిరెడ్డి, సురేందర్ రెడ్డి, పుదరి ఎల్లయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.