పిచ్చోడు హల్ చల్

 సిరా న్యూస్,తాండూరు;
మతిస్థిమితం లేని ఓ పిచ్చోడు తాండూర్ పట్టణంలో హల్చల్ చేశాడు. రోడ్లపై ఎవరు కనిపించిన వారి పై దాడికి దిగాడు. దీంతో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఏకంగా పిచ్చోడిపై వందమంది దాడికి దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో చోటుచేసుకుంది . స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉదయం 6 గంటల కు రోడ్డుపై వెళ్తున్న కొందరు వ్యక్తులపై గుర్తుతెలియని వ్యక్తి పిచ్చోడు దాడికి తెగపడ్డాడు . దీంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పిచ్చోడు ఇష్టం ఉన్నట్లుగా వివరించడంతో, తీరును గమనించిన స్థానిక ప్రజలు పిచ్చోడు పై ప్రతి దాడి చేశారు ఏకంగా వందమంది పిచ్చోడి పై దాడికి తెగ పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిచ్చోన్ని గొలుసులతో కట్టేసి స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *