నీట్ పరీక్షను ఎన్టీయే ను రద్దు చేయకపోతే ధర్నా చౌక్ వద్ద మహా దీక్ష

ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేస్తాం
బల్మూర్ వెంకట్
సిరా న్యూస్,హైదరాబాద్;
నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళి నిర్వాయించాలని , ఎన్టీయే నీ రద్దు చేయాలని కోరుతు యువజన,విద్యార్థి సంఘాల నాయకులు నారాయణగూడ చౌరస్తా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. ఈ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ యువజన సంఘాల నాయకులు పాల్గోన్నారు.
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైన కేంద్ర ప్రభుత్వం, ఎన్టీయే పరీక్షలు రద్దు చేయకుండ మౌనంగా ఉండడం దుర్మార్గం. గత 15రోజుల నుండి నీట్ విద్యార్థుల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాము. *కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 60 వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. అప్పోయింట్మెంట్ అడిగిన కిషన్ రెడ్డి స్పందించకపోవడం తో ఆయన ఇంటిని ముట్టడించాము. *స్టూడెంట్ మార్చ్ నిర్వహించాము, సిగ్నిచర్ కాంపెయిన్ చేశాము, నిన్న ఢిల్లీ లో పార్లమెంట్ ముట్టడి చేశాము. ఈ రోజు మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశాము. *ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల అధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహా దీక్ష చేస్తాము. *ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. *అప్పటికి స్పందించకపోతే నీట్ కౌన్సిలింగ్ రోజు దేశ వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ను ఏకం చేసి భారత్ బంద్ నిర్వహిస్తామని అన్నారు
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *