సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రెస్ లో చేరిన మహాకాల్ సేన అధ్యక్షులు అజయ్..
+ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ కు చెందిన మహాకాల్ సేన అధ్యక్షులు అజయ్, తన సేనా సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో, కంది శ్రీనివాసరెడ్డి అజయ్ తో పాటు సేనా సభ్యులు, 12, 18 వార్డులకు చెందిన యువకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… కార్యకర్తలంతా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం మహా కాల్ సేన అధ్యక్షులు అజయ్ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పాలన, కంది శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాళ్ల విట్టల్, ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల విట్టల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఆవుల వెంకన్న, బండారి సతీష్, సంద నర్సింగ్, రామ్ కుమార్, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.