సిరా న్యూస్, ఆదిలాబాద్
అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
* రాళ్ల బండి మహేందర్
* ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం
ప్రస్తుత తరుణంలో పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఆర్భాటంగా విలాసవంతంగా జరుపుకుంటున్నారు.కానీ ఒక యువకుడి ఆలోచన అందరినీ ఆలోచించే విధంగా చేసింది. రాళ్ళబండి మహేందర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అదిలాబాద్ లోని శంకర్ గుట్టలోని ఆంజనేయ స్వామి దేవస్థానానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని కోరారు. అలాగే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు చేపట్టాను, ఇక ముందు కూడా ధార్మిక కార్యక్రమాలలో ముందుకు సాగుతాను అని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రమా గౌడ్, సంజీవ్,ఎల్చాల మల్లేశ్, పిట్ల ఓం ప్రకాష్,సుదర్శన్, రమేష్, అభిలాష్, శేఖర్, తీగల మల్లేష్,భూమేష్ రెడ్డి,అభిరామ్ అశోక్,మరియు శంకర్ గుట్ట కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.