సిరా న్యూస్,బేల
వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి : ఎంపీడీవో మహేందర్
వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని ఎంపీడీవో మహేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సోమవారం ఎంపీడీవో మహేందర్ పలు గ్రామాలను సందర్శించారు. అనంతరం బేల మండలంలోని గ్రామపంచాయతీ దుబ్బగూడా లో నీటి సమస్య విద్యుత్ నర్సరీలను పర్యవేక్షించారు . అలాగే పరిసర ప్రాంతాలైన టాక్రీ , తోయగూడ, మసాల కే.సాంగ్వీ గ్రామాల్లో ఈ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శిలకు అప్పగించామని అన్నారు.ఎంపీడీవో మహేందర్, ఎంపిఓ మహేష్, గ్రామ కార్యదర్శులు ఉన్నారు.