సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ కొత పీసీసీ ఛీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించినప్పటికీ ఈక్వేషన్లు కుదరక టికెట్ దక్కని ఆయన్ని పార్టీ పదవి వరించింది. క్రమంలో మహేష్‌కుమార్ పాటిస్తున్న సెంటిమెంట్ ఆసక్తికరంగా మారింది. మహేష్ గౌడ్ కుర్చీ సెంటిమెంట్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఆయనకేంటి కుర్చీ సెంటిమెంట్ అని చర్చించుకుంటున్నారు. తే ఏవరు ఏమనుకుంటే ఏంటి. తనకు అదృష్టం తెచ్చిన కూర్చీని సెంటిమెంట్‌గా ఫాలో అవ్వడానికి ఫిక్స్ అయ్యారాయన. ఎవరి నమ్మకాలు వారివి మరి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాంధీభవన్లో తాను కూర్చున్న కూర్చినే ఇప్పుడు ఆయన పీసీసీ చీఫ్ ఛాంబర్‌కి మార్పించుకున్నారు. దాంతో ఆ కుర్చీ టాక్ ఆఫ్ గాంధీభవన్ అయిపోయింది. ఆ కుర్చీ వల్లే ఆయనకు అదృష్టం వరించిందిజఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలతో పాటు ఢిల్లీ పెద్దలు హాజరుయ్యారు పార్టీ పెద్దలు పలువురు హాజరు కానుండటంతో గాంధీ భవన్ లో భారీ ఏర్పాట్లు చేశారు..అవన్నీ రోటీన్‌గా జరిగేవే అయినా ఒక కుర్చీ గురించి హస్తం పార్టీ లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గాంధీ భవన్‌లో ఉన్న ఓ కుర్చీ కి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు వీడదీయలేని బంధం ఉందంట. మహేష్ గౌడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ కుర్చీ ఉండాలట. కుర్చీ వచ్చిన నాటి నుంచి మహేష్ గౌడ్‌కు అన్ని కలసి వచ్చాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. దాంతో ఇంతకీ ఆ కుర్చీ కథేంటో తెలుసుకోవాలని ఆందరూ ఆరా తీస్తున్నారు.మహేష్ గౌడ్ ఎన్ఎస్‌యూఐ నుంచి పార్టీలో ఉన్నప్పటికీ ఆ కుర్చీ వచ్చిన తర్వాతే అన్ని కలసి వస్తున్నాయట. ఏ రోజైతే తన ఇంటికి ఆ కుర్చీ వచ్చిందో అనాటి నుంచి రాజకీయాల్లో అన్ని కలసి వచ్చాయని మహేష్ గౌడ్ చెపుతుంటారు. తన ఇంట్లోకి ఆ కుర్చీ రాగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిందని సన్నితులతో చెప్తుంటారంట. దాంతో గాంధీ భవన్‌లోని తన ఛాంబర్ లో ఇంటి దగ్గర ఉన్న కుర్చీ తెప్పించుకుని ఇన్ని రోజులు దాంట్లోనే కూర్చున్నారు. ఇప్పుడు పీసీసీ పదవి రావడం తో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ కుర్చీ లో అయితే కూర్చున్నారో అదే కూర్చిని తన కొత్త చాంభర్‌కు మార్పించుకున్నారు.