సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల లో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తి మహిళలపై మతోన్మాదులు చేసిన దాడికి ఖండిస్తూ బాధిత మహిళలకు మద్దతుగా రాష్ట్ర మహిళా మొర్చ అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అధ్వర్యంలో మహిళా మోర్చ శ్రేణులు మద్దతుగా నిలిచారు. బాధిత మహిళలకు మద్దతుగా మహిళా మోర్చా శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకునే క్రమంలో సంఘటన స్థలానికి సమీపాన పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి… అక్కడే కూర్చొని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో జాతీయ ఎస్టి కమిషర్ నెంబర్ హుస్సేన్ నాయక్ చెంగిచర్ల పిట్టల బస్తిలోని బాధితులను పరామర్శించడానికి వెళ్లడంతో, మహిళా మోర్చా శ్రేణులు బార్కెట్లనును తోచుకొని కొంత మంది మహిళలు సంఘటన స్థలానికి వెళ్లగా, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డితో పాటు మరి కొంత మంది మహిళలను అరెస్టు చేసి కీసర పిఎస్ కు తరలించారు.
బాధితులను పరామర్శించిన జాతీయ ఎస్టి కమిషర్ నెంబర్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ… సంఘటన జరగడం సిగ్గుచేటు, బాధాకరమన్నారు…
గిరిజన మహిళలను కొట్టడం అక్కడే ఉన్న పోలీసులను కూడా కొట్టారని, పోలీసులు కూడా బాత్రూంలలో దాక్కునే పరిస్థితి వచ్చిందని బస్తి వాసులు చెబుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూంలో దాచుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో సిగ్గుచేటు అన్నారు..మతోన్మాదులపై పెట్టిన కేసులు చాలా వీక్ కేసులని వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. రాచకొండ సిపి తక్షణమే నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాటిసి కేసులు నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్ బాధితులకు సహాయం అందే విధంగా చూడాలని అన్నారు. బాధితుల వెంట నేనున్నానని హుస్సేన్ నాయక్ అన్నారు…