సిరా న్యూస్,తుని;
బోగలింగేశ్వర దార్మిక సేవా సమితి రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో తుని ఆర్యవైశ్య సంఘం మరియు మిత్ర సంఘాల ఆధ్వర్యంలో కోటి లింగాల తయారీ కార్యక్రమం లో భాగంగా తునిలో సుమారు రోజుకి 200 మంది మహిళలు పాల్గొని ఈ యొక్క లింగాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ కాశీ తరలిస్తున్నటువంటి కోటిలింగాల తయారు చేసే కార్యక్రమంలో తము పాలు పంచుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నామన్నారు . ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి బాగాలింగేశ్వర స్వామి దార్మిక సేవా సమితి తామెంతో రుణపడి ఉంటామన్నారు. వీటి అంటిని తయారుచేసి కాశీలో ఉన్నటువంటి పుణ్యం నదులు అన్నింటికీ కూడా వీటిని తరలించడం జరుగుతుందన్నారు. అనంతరం పూజలు అందుకున్న తర్వాత ఈ లింగాలన్నింటిని కూడా పుణ్య నదుల్లో కలపటం జరుగుతుందన్నారు.