సిరాన్యూస్, కుందుర్పి
మలకలపర్తి లో ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహం ఊరేగింపు
కుందుర్పి మండలంలోని మలకలపర్తి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేకంగా స్వామి వారికి పంచామృత అభిషేకలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు ఆ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.