Mali Maha Sangam Sukumar Petkule: ఎస్టీ హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలి : అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఎస్టీ హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలి : అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
* ఘనంగా మాలి సంఘం జెండా పండుగ వారోత్సవాలు ప్రారంభం

కేంద్రం వెంటనే స్పందించి ఎస్టి హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. గురువారం మాలిల ఉద్యమ పతాకమైన మాలి సంఘం జెండా పండుగ వారోత్సవాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పూలే గెస్ట్ హౌస్ లో అఖిల భారతీయ మాలి మహా సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి జెండాను ఎగరేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా మాలీల కోసం మాలీల ఉద్యమ జెండా సాక్షిగా అనేక పోరాటాలు చేసామని, ఆ పోరాట ఫలితంగానే గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మాలీలకు ఎస్టీ హోదా బిల్లు కేంద్రానికి పంపించడం జరిగిందని, కేంద్రం వెంటనే స్పందించి ఎస్టి హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలని, అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమదం పొందేలా కృషిచేసి మాలీ కులస్తులకు సామాజిక న్యాయం కల్పించాలని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో మాలీలు వెనుకబడి ఉన్నారని, ఎస్టీ హోదా కల్పన వల్లనే మాలికులస్తులకు న్యాయం జరుగుతుందని అన్నారు. మాలి కులస్తుల నివసిస్తున్న అన్ని గ్రామాల్లో జెండాలను ఎగిరేసి మాలిలో ఐక్యతను చాటుకుని హక్కుల సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలి మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శె0డే జిల్లా అధ్యక్షులు విజయవాడగురై మాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, కార్యవర్గ సభ్యులు అనిల్ కోట్రంగే, అనిల్ మొహూర్లే, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీను ఆచారి, సుభాష్ శెండే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *