సిరా న్యూస్, పెద్దపల్లి
ఇద్దరి అంధులకు చూపును ప్రసాదించిన మల్లమ్మ
పెద్దపల్లి జిల్లా ఓదెల నివాసి అయిన రామినేని మల్లమ్మ (75) మృతి చెందగా ఆమె నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిందని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి కుటుంబ సభ్యులకు తెలిపారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించగా ఎల్‌వీపీ గోదావరిఖని ఐ బ్యాంక్ టెక్నీషియన్ లక్ష్మణ్ ద్వారా నేత్రాలను సేకరించి , ఐ బ్యాంక్ కు తరలించారు. దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించుట కు ముందుకు వచ్చిన కుమారుడు,కోడలు శ్రీనివాస్ భాగ్యలక్ష్మి, కూతుర్లు అల్లుండ్లు భాగ్యలక్ష్మి సత్యనారాయణ, సారక్క లింగయ్యలకు నేత్రసేకరణ చేసిన ఎల్‌వీపీ లక్ష్మణ్ కు, ప్రోత్సహించిన అల్లం సతీష్ లకు సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, రామగుండం లయన్స్ క్లబ్ , , కోశాధికారి మనీషా అగర్వాల్, ప్రతినిధి బెణిగోపాల్ త్రివేది అభినందనలు తెలిపారు.