సిరాన్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో ఘనంగా విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు
భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ మహోత్సవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండపర్తి రాజు, ఉపాధ్యక్షులు కొడపర్తి మహేష్, కార్యదర్శి పులి రాజు, మల్లారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ సర్పంచ్ గూడెల్లి రాజిరెడ్డి, మల్లారం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు వీర చారీ, మహేష్, సదానందం, శ్రీను, ప్రకాష్, గణేష్, మాజీ సర్పంచ్ గిరిమల్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.