సిరాన్యూస్, బోథ్
జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్
* తహసీల్దార్‌కు వినతి పత్రం
రైతులు పండించినటువంటి జొన్న, మొక్కజొన్న పంటలను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పండించిన జొన్న పంటను ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల 85 రోజులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరైంది కాదని అన్నారు. పంట కొనుగోలు పై పరిమితి ఎత్తివేయాలని లేకుంటే రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. మొక్కజొన్న పంటను సహితం ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్, నరేందర్ భీమ బుచ్చన్న రమణ గౌడ్ దేవి దాస్ లతోపాటు పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.