సిరాన్యూస్, ఓదెల
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం
* శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం విద్యుత్ దీపాలతో అలంకరణ
* భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఓదెల జిల్లాలోనే అతి ప్రాముఖ్యమైన దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉగాది పండుగ నుండి మొదలుకొని మూడు మాసాలు జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ నుంచి భారీ ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుని వెళ్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించినారు వచ్చిపోయే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవి తాపాన్ని గుర్తుంచుకొని చలువ పందిళ్ళతో వచ్చిపోయే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేవాలయానికి గాను బస్సు ఆధ్వర్యంలోని రైలు సౌకర్యం గాని అనుకూలంగా ఉన్నాయి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయగలరని ఆలయ నిర్వాహకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సదయ్య .సిబ్బంది ముద్దసాని కుమారస్వామి. ఆలయ కమిటీ చైర్మన్ మేకల మల్లేశం, ధర్మకర్తలు ఉన్నారు