సిరాన్యూస్, ఓదెల
మల్లికార్జున స్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 27 లక్షలు
ఓదెల పెద్దపల్లి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓ దెల మల్లికార్జున స్వామి దేవస్థానం వారు దేవాదాయ శాఖ పెద్దపల్లి కమిషనర్ సుజాత రెడ్డి ఆధ్వర్యంలో గురువారం హుండి లెక్కింపు నిర్వహించారు. దేవస్థానం వారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి హుండీ లెక్కింపు నిర్వహించనున్నారు. లెక్కింపులో అన్నమయ్య సేవా సమితి కరీంనగర్ మహిళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు లెక్కింపులో పాల్గొన్నారు.హుండీ లెక్కింపులో భాగంగా మల్లికార్జున స్వామి హుండీ ఆదాయం రూ, 28, 78,113లు హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం ఈవో సదయ్య, ముద్దసాని కుమారస్వామి, ఆలయ సిబ్బంది మహదేవుని భూమయ్య, ఆలయ చైర్మన్ మేకల మల్లేశం, ధర్మకర్తలు రాపర్తి మల్లేశం, మెడగొని శ్రీకాంత్, భత్తుల రమేష్ బాబు, చింతం వెంకటస్వామి, మొగిలి. అరెల్లి మొండయ్య. తదితరులు పాల్గొన్నారు.