సిరాన్యూస్,ఓదెల
భక్తుల కోసం గ్రీన్ పరదలు ఏర్పాటు
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి ఆది, బుధవారాల్లో ఎక్కువ భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళుతుంటారు . ఎండ తీవ్రతను చూసి దేవాలయం ముఖద్వారం వద్ద వాహన పూజలు చేసే సమయంలో ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా గ్రీన్ పదాలు ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. చెట్ల కింద వంట చేసుకునే స్థలం లేక పోవడంతో భక్తులు ఎండలోనే వంట చేసుకుని బోనాలు చెల్లించుకున్నారు.