సిరాన్యూస్, ఓదెల
మల్లికార్జున స్వామి దేవస్థానానికి 20లక్షల ఆదాయం
* కమిషనర్ ఆధ్వర్యంలో హుండి లెక్కింపు
పెద్దపల్లి జిల్లాలోని అతి పెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వారు దేవాదాయ శాఖ పెద్దపల్లి కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో శనివారం లెక్కింపు నిర్వహించారు. దేవస్థానం వారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఉండి లెక్కింపు నిర్వహించనున్నారు. హుండీ లెక్కింపులో శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి స్వచ్ఛంద సంస్థ వారు సుల్తానాబాద్ నుండి 50 మంది మహిళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. హుండీ లెక్కింపులో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి హుండీ ఆదాయం రూ. 20,09,533 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సదయ్య, ఆలయ సిబ్బంది ముద్దసాని కుమారస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు ధూపం వీరభద్రయ్య, మహదేవుని భూమయ్య, ఆలయ ధర్మకర్తలు రాపర్తి మల్లేశం కర్రె కుమారస్వామి మ్యాడగోని శ్రీకాంత్, ఓదెల తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి కో ఆర్డినేటర్ కొమురవెల్లి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.