Mallikarjuna Swamy: ఓదెల మల్లికార్జున స్వామి పెద్దపట్న అగ్నిగుండ మహోత్సవం

సిరాన్యూస్‌, ఓదెల‌
ఓదెల మల్లికార్జున స్వామి పెద్దపట్న అగ్నిగుండ మహోత్సవం
* హాజ‌రైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. ఈ దేవ‌స్థానంలో ఉగాది పండుగ నుండి మొదలుకొని మూడు నెలల పాటు వేలాది భక్తులతో ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. శ్రీ కోది నామ సంవత్సర ఆషాడ శుద్ధ అష్టమి ఆదివారం ఉదయం 9 నుండి గణపతి పూజ పుణ్యాహ వచనము, మంటప స్థాపన శ్రీ వీరభద్రారాదన, రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ భద్రకాళి ఆవాహన, రాత్రి 10 గంటలకు పెద్దపట్న మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజ‌ర‌య్యారు. సోమవారం ఉదయం ఐదు గంటలకు కోరిన కోరికలు తీర్చే స్వామి వారి కోసం భక్తులు అగ్నిగుండం లో నడిచి స్వామి వారి భక్తిని నిరూపించుకున్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా ఆలయ చైర్మన్ మేకల మల్లేశం అలయ ఈవో సదయ్య, ధర్మకర్తలు, జూనియర్ అసిస్టెంట్ ముందసాని కుమారస్వామి, ఆలయ సిబ్బంది తగు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు అశోక్ రెడ్డి, ఓంకార్ యాదవ్, పోలీస్ బందోబస్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి , సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ధర్మకర్తలు అరెల్లి మొండయ్య, బత్తుల రమేష్ బాబు, రాపర్తి మల్లేష్, మేడగోని శ్రీకాంత్, కానీకిరెడ్డి సతీష్, చింతం వెంకటస్వామి, మొగిలి, మూడెత్తుల శ్రీనివాస్, కర్రె కుమారస్వామి, ఓదెల టు సినిమా దర్శకులు అశోక్ తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గిరి చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *