సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్ష బిల్వర్చన
పెద్దపల్లి జిల్లాలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురువారం 150 మందికి పైగా జంటలతో లక్ష బిల్వర్చన ఆలయం వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి వారంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో అన్నదాతగా గోదావరిఖని వాస్తవ్యులు రాయమల్లు సుగుణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సదయ్య, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది ముద్దసాని కుమారస్వామి, ఆలయ ధర్మకర్తలు రాపర్తి మల్లేశం, బత్తుల రమేష్ బాబు, చింతం మొగిలి, వెంకటస్వామి, మ్యాడగోని శ్రీకాంత్, ఆళ్ల రాజిరెడ్డి, ఆ రెల్లి మొండయ్య, కర్రె కుమార్ స్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
