సిరా న్యూస్,రంగారెడ్డి;
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్మాస్ గూడ రాజీవ్ గృహకల్ప కు చెందిన శివ(52) భార్య లక్ష్మితో తరచూ గొడవ పడుతూ ఇంటి నుండి వెళ్లిపోతున్నాడు ఎప్పటి లాగానే రెండు రోజుల క్రితం భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయాడు. అల్మాస్ గూడ లోని కోమటికుంట చెరువులో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త మేస్త్రి పని,భార్య చంపాపేట్ డీమార్ట్ లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు