సిరా న్యూస్,హైదరాబాద్;
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం జరిగింది. క్యూ లైన్ నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని పోలీసులు వెంటనే స్థానిక కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి నిజమాబాద్ కు చెందినట్లు సమాచారం..
=========