సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రోజుకో లీలలు బయటపడుతున్నాయి. లక్షలాది రూపాయల కౌంటర్ ను తాత్కాలిక ఉద్యోగులకు అప్పగించడం లో ఆంతర్యం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.డిసిఆర్ రాయడంలో అవకతవకలు జరిగితే బాధ్యులు ఎవరు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు.దేవాలయ సొమ్మును కాపాడుకోవాల్సిన బాధ్యత రాజన్నదే. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.