ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాకం

రాత్రంతా పోలీసు స్టేషన్ తో గడిపిన ప్రయాణికులు
సిరా న్యూస్,సంగారెడ్డి;
ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్వాహకుల అలసత్వం, డ్రైవర్ దురుసు ప్రవర్తనా తీరుతో ప్రయాణీకులు తమ గమ్య స్థానానికి వెళ్లకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్ లో, బస్సులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు 25 మంది ప్రయాణికులు వేర్వేరుగా ఓం శ్రీ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. ఎల్ బీ నగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా మియాపూర్ వద్దకు రావాలని, ఆ డబ్బులు తామే చెల్లిస్తామని చెప్పడంతో ఆయా ఏరియాల నుంచి మియాపూర్ వరకు వచ్చి ట్రావెల్ బస్సులో ఎక్కారు. అక్కడి నుంచి ప్రారంభమైన బస్సులో కనీస సౌకర్యాలు లేకపోవడం, శుభ్రంగా లేకపోవడంతో పాటు విద్యుత్ వైర్లు తేలి ఉండడంతో డ్రైవర్ కు చెప్పగా నిర్లక్ష్యం గా సమధానమిస్తూ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్ వద్దకు రాగానే మధ్యలో ఆపి బస్సు దిగి వెళ్లి పోయే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రయాణికులు 100 కు డయల్ చేయడంతో పోలీసుల సహకారంతో డ్రైవర్ బస్సును రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి పరారైన బస్సు డ్రైవర్ ఉదయం వరకు రాలేదు. డ్రైవర్ కోసం, బస్సు కోసం వేచి చూస్తూ ప్రయాణికులు పిల్లా పాపలతో పోలీస్ స్టేషన్ ఎదుటే పడి గాపులు కాయాల్సి వచ్చింది. ట్రావెల్స్ యజమాని సునిల్ నిర్లక్ష్యం గా సమాధానమిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండని, కేసు పెడితే పెట్టుకోండని అంటున్నాడని ప్రయాణికులు తెలుపుతున్నారు. నిర్లక్ష్యం గా వ్యవహరించిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునిల్ పై, డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుని ఫిట్ నెస్ లేని ఓం శ్రీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *