నామినేట్ పదవి రేసులో మంచూరు సూర్యనారాయణ రెడ్డి

సిరా న్యూస్,బద్వేలు;
అట్లూరు మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరు. సూర్యనారాయణ రెడ్డి నామినేట్ పదవి రేసులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతూ అనేక విశిష్ట సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో దిశా నిర్దేశం చేస్తూ ఉండేవారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పార్టీకి వెన్నంటే ఉండడమే కాకుండా బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అట్లూరు మండలంలో నేకాకుండా బద్వేల్ పట్టణంలో వివిధ వార్డుల్లో టిడిపి కేడర్ ను విస్తృతపరచడంలో సూర్యనారాయణ రెడ్డి దిట్టగా పేరు ఉంది. ప్రత్యర్థిపార్టీ నాయకుల ప్రలోభాలకు గురిచేసిన వాటిని ఏమాత్రం లెక్కచేయని సూర్యనారాయణ రెడ్డి టిడిపికి అంకితభావంతో చిత్తశుద్ధితో సేవలు అందించారని ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇలా ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన సూర్యనారాయణ రెడ్డి నామినేట్ పదవికి అన్ని విధాల అర్హత సాధించుకున్నారని పలువురు టిడిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నామినేట్ పదవులను నియమించనుంది ఈ నేపథ్యంలో సూర్యనారాయణ రెడ్డి కి నామినేట్ పదవిని కేటాయిస్తే బాగుంటుంది అని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు లు సూర్య నారాయణరెడ్డి కు నామినేట్ పదవి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *