Mandagada: బదిలీపై వెళ్తున్నఉపాధ్యాయుల‌కు మాండగాడా గ్రామ‌స్తుల స‌న్మానం

సిరాన్యూస్, జైన‌థ్‌
బదిలీపై వెళ్తున్నఉపాధ్యాయుల‌కు మాండగాడా గ్రామ‌స్తుల స‌న్మానం

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాండగాడా పాఠశాల నుంచి బ‌దిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు బి. రమేష్ , ఎ స్వాతి, కే రామకృష్ణ, బి అరుణ, ఎం డి షాహేభాజ్ల‌ను శ‌నివారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు చేసిన సేవలను విద్యార్థులకు పంచిన జ్ఞానాన్ని కొనియాడారు.అదేవిధంగా మాండగాడా పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఎం చంద్రమని, టీ అర్చన, సునందలను కూడా సన్మానించి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు మామిడి మల్లా రెడ్డి, ముక్కెర ప్రభాకర్, సిలిగం ఆశన్న, అక్నూర్ గణేష్, నర్ర విట్టల్, ఎస్ కే ఇరాజ్, మాజీ ఎంపీటీసీ ముడుపు ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పాఠ‌శాల‌కు 20 కుర్చీలు అంద‌జేసిన‌ ఉపాధ్యాయురాలు బొడిగం స్వాతి

జైనథ్ మండలంలోని మాండగాడా పాఠశాల ఉపాధ్యాయురాలు బొడిగం స్వాతి గత పన్నెండు సంవత్సర నుండి పని చేస్తూ బదిలీపై వెళ్తున్నారు. శ‌నివారం ఆమె విద్యార్థులకు ఇరవై కుర్చీలను అందించి తన ఉదరాతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు స్వాతిని గ్రామస్తులు, విద్యార్థులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *