కుందుర్తి, సిరా న్యూస్
మండల సర్వసభ్య సమావేశంలో సమస్యల ఏకరువు
ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంతల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలైన అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. గురువారం కుందుర్పి మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ (మీటింగ్ హాల్)లో ఎంపీపీ కమలమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో గ్రామ పంచాయతీలో ప్రజలు ఎందుర్కొం టున్న విద్యుత్, ఉపాధి హామీ, నాడు -నేడు పనులు, విద్య కు సంబందించిన విషయాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచ్‌ల ఎదుట వారివెంట తెచ్చుకున్న సమాచారాన్ని చదివి వినిపించారు. వేసవికాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సర్వసభ్య సమావేశం దృష్టికి వివిధ గ్రామాల సర్పంచులు ,తీసుకువచ్చారు . మండలంలో, మండల కేంద్రంలో చిన్నారులకు, బాల్య వివాహల గురించి, అవగాహన కార్యక్రమాలు చేయాలని ఐసీడీఎస్ అధికారి చర్చిచారు.వేసవి కాలంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై అధికారులను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలన్నారు. మూడు సర్వ సభ్య సమావేశాలు నుంచి అధికారులకు సమస్యలు తమ ముందు పెట్టిన ఇప్పటివరకు పరిష్కరించలేదని అధికారులపై మండిపడ్డారు. కొంతమంది కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజర్ కావడంతో ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు,,