సిరాన్యూస్, ఇచ్చోడ
భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాల్సిందే : మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య
భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాల్సిందేనని మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ఈ సందర్బంగా ఇచ్చోడ మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మొక్కలు ఎంతో తోడ్పాటు ఇస్తాయని, స్వచ్ఛమైన గాలి వర్షాలు కురవడానికి పాటుపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వేచ్ఛగా ఉండాలని ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రం చేసుకుని ఇలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణ్ ప్రధానోపాధ్యాయులు రమాకాంత్, నాయకులు ఆసిఫ్ ఖాన్, సురేందర్ రెడ్డి పారుఖ్, గ్రామస్తులు రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు