సిరా న్యూస్,మందమర్రి;
చలో తుక్కుగూడ భారీ బహిరంగ సభ జన జాతరకు మందమర్రి కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ లు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లడం జరిగిందని ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలు అమల్లోకి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు నిలయ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామ్ చందర్ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజిని నూగురి రాధా దాసరి స్రవంతి యువజన కాంగ్రెస్ నాయకులు ఆకుల అంజి ఆకుదారిశ్రీనివాస్ అందుగుల లక్ష్మణ్ చిప్పకుర్తి శశిధర్ సలిగంటి జీవన్ సొప్పరి గౌరయ్య శంకర్ పెంచల రాయలంగు కనకరాజు అలుగుల నాగరాజు నూతి అంజి గోపతి లింగయ్య జుమ్మడి శేఖర్ పెద్దపల్లి సత్యనారాయణ మల్లేష్ శంకర్ తదితరులు వెళ్లడం జరిగింది
===============